ఈ మధ్య ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆ సినిమాని చూస్తున్నారు. కానీ ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా సినిమా విడుదల చేస్తే మాత్రం థియేటర్లో ప్రేక్షకులు సందడి కాదు కదా అటు వైపు కూడా వెళ్లడం లేదని చెప్పవచ్చు. పెద్ద పెద్ద చిత్రాలకి విడుదలకు ముందు భారీ స్థాయిలో కొన్ని కోట్ల రూపాయలు కేవలం ప్రచారం కోసమే చేయవలసి వస్తోంది. అంత చేసినా కూడా కంటెంట్ సరిగ్గా లేకపోతే ఆ సినిమాని ఎవరూ పట్టించుకోవడం లేదు . ఇటీవల ఎన్నో చిత్రాలకు ఇలానే జరిగిందని చెప్పవచ్చు.

ఇక పాన్ ఇండియా చిత్రాల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూనే ఉన్నారు చిత్రబృందం. స్టార్ ప్రొడ్యూసర్ గా, నటుడిగా పేరు పొందాడు బండ్ల గణేష్. తాజాగా ఈయన కీలకమైన పాత్రలో నటించిన డేగల బాబ్జి సినిమా విడుదలయ్యింది. ఇక రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా విడుదలైన రోజునే ఈ చిత్రం కూడా విడుదల అవ్వడం జరిగింది. సింగిల్ ఆర్టిస్టుతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి అంచనాలను అందుకోలేక పోయింది.

ఇంకా చెప్పాలంటే ఈ సినిమాని పట్టించుకునే నాధుడే లేరని చెప్పవచ్చు తెలుగు రాష్ట్రాలలో కూడా అతి తక్కువ స్క్రీన్లలో ఈ చిత్రం విడుదల అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయినట్టుగా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.ఇక ఈ స్థాయిలో ఈ సినిమా ప్రచారం నిర్వహించకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. చివరికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ ఈ సినిమాను చూసిన కొంతమంది కూడా డిజాస్టర్ అని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీగా ఎఫెక్ట్ పడిందని చెప్పవచ్చు. అంతేకాకుండా బండ్ల గణేష్సినిమా పైనా ఆశలు పెట్టుకుంటే ఆ సినిమా బిస్కెట్ అవుతోందని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: