సినిమా రంగం అనేది ఒక రంగుల ప్రపంచం... ఇక్కడ హీరో అయినా హీరోయిన్ అయినా అందంగా ఉంటేనే ఎక్కువ కాలం కొనసాగగలరు. అందుకోసం వీరు తమ మొఖంలో ఉండే కొన్ని భాగాలూ సరిగా లేకుంటే ఆపరేషన్ లు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేసుకోవడం అంత ఆరోగ్యకరం కాదని వారికి తెలిసినా కెరీర్ కోసం సాహసం చేస్తారు. కానీ ఇలా సర్జరీలు చేసుకున్న చాలా మంది బాగానే ఉన్నా కొద్దిమంది మాత్రం దీని వలన ఎఫక్ట్ అయ్యి అనారోగ్య బారిన పడుతుంటారు. కొన్ని సార్లు అయితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ విధంగా సర్జరీలు చేసుకుని ఎఫెక్ట్ అయిన కొంత మంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని తెలుగు వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఈమె కూడా తన అందం కోసం కొంచెం సరిగా లేని తన ముక్కుని సర్జరీ చేసి షేప్ ను మార్చుకుంది. అప్పటి వరకు సౌత్ లోనే సర్జరీ చేయించుకున్న మొదటి నటి ఈమే కావడం విశేషం. ఇక ఈమె కాకుండా ఇదే విధంగా సర్జీరీ చేసుకున్న వారిలో ఇంటర్నేషనల్ పాప్ సింగర్ మైకేల్ జాక్సన్, కత్రినా కైఫ్, రాఖీ సావంత్, జుహీ చావ్లా, వాణి కపూర్ లాంటి వారున్నారు. అయితే కొంతకాలం తర్వాత వీరు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాదపడినట్లు తెలుస్తోంది. ఈ సర్జరీ వలన వారి శరీరంలో అయితే కొంతమంది ఈ సర్జరీల కారణంగా ప్రాణాలను సైతం కోల్పోయినట్లు మనకు సమాచారం ఉంది.

అంతెందుకు ఒకప్పుడు టాలీవుడ్ ను తన అందంతో ఊపేసిన కుమారి ఆర్తి అగర్వాల్ సర్జరీ కారణంగానే మరణించిందని తెలిసిందే. అలాగే పంజాబీ నటుడు వివేక్ కూడా సరాజారీ కారణంగానే చనిపోయాడు. కన్నడ నటి అయినా చేతనా రాజ్ కూడా సర్జరీ వికటించి ప్రాణాలు వదిలింది. అందుకే అందం ఒక్కటే అవసరం కాదు ఆ తర్వాత అనుభవించాల్సిన జీవితం ఎంతో ఉంది.  


 


మరింత సమాచారం తెలుసుకోండి: