కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫుల్ క్రేజ్ ఉన్న దర్శకులలో లోకేష్ కనకరాజు ఒకరు. లోకేష్ కనకరాజు, సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మానగరం మూవీ తో కోలీవుడ్ ఇండస్ట్రీ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో లోకేష్ కనకరాజు కు కోలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత లోకేష్ కనకరాజు కార్తీ హీరో గా ఖైదీమూవీ ని తెరకెక్కించాడు.  ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. 

మూవీ తో లోకేష్ కనకరాజు కోలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు. ఆ తర్వాత లోకేష్ కనకరాజు కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తళపతి విజయ్ హీరోగా మాస్టర్ మూవీ ని తెరకెక్కించాడు.  ఈ సినిమా కూడా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇలా వరుస విజయా లతో ఫుల్ ఫామ్ లో ఉన్న లోకేష్ కనకరాజు ప్రస్తుతం యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా విక్రమ్ మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమా జూన్ 3 వ తేదీన విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా లోకేష్ కనకరాజు తన తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశాడు.  

తాజాగా దర్శకుడు లోకేష్ కనకరాజు...  తలపతి విజయ్ తో తన తదుపరి సినిమా ఉండబోతోందని కన్ఫర్మ్ చేశాడు.  అలాగే దర్శకుడు లోకేష్ కనకరాజు,  తలపతి విజయ్ తో తెరకెక్కించబోయే సినిమా మాస్ మరియు క్లాస్ ఆడియన్స్ ను మెప్పించే విధంగా ఉంటుంది అని తెలియజేశాడు.  ఇది వరకే తళపతి విజయ్ లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో మాస్టర్ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: