సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో సముద్ర ఖని ప్రతినాయకుడి పాత్రలో వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన పాత్రలో,  తమన్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే.  మొదటి రోజు నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేస్తున్న సర్కారు వారి పాట సినిమా ఇప్పటి వరకు పది రోజుల బాక్సాఫీస్ రన్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది.  

పది రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.
నైజాం : 31.43 కోట్లు
సీడెడ్ : 10.71 కోట్లు
యూ ఎ : 11.53 కోట్లు
ఈస్ట్ : 7.94 కోట్లు
వెస్ట్ : 5.18 కోట్లు
గుంటూర్ : 8.23 కోట్లు
కృష్ణ : 5.41  కోట్లు
నెల్లూర్ : 3.24 కోట్లు
మొత్తంగా 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి గాను సర్కారు వారి పాట మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 83.67 షేర్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయగా,  125.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 6.10 కోట్లు
ఓవర్సిస్ లో : 11.85 కోట్లు.


పది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి గాను సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా 101.62 కోట్ల  షేర్ , 125 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటి వరకు 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న సర్కారు వారి పాట సినిమా ప్రస్తుతం కూడా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: