టాలీవుడ్ యంగ్ హీరో 'ఈ నగరానికి ఏమైంది', ఫలక్నామా దాస్' 'హిట్' లాంటి సినిమాలతో హిట్స్ అందుకొని గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' చిత్రం మే 6 వ తేదీన చాలా పెద్ద హైప్ తో ఎన్నో భారీ అంచనాలతో విడుదల అయ్యింది. ఓ పాట హిట్ అవ్వడం ఇంకా అలాగే ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉండడం..ఇక వీటన్నిటికీ తోడు ఇటీవల ఓ న్యూస్ ఛానల్ లో హీరో విశ్వక్ సేన్ ఇంకా అలాగే ఓ యాంకర్ కు మధ్య జరిగిన మాటల తూటాల యుద్ధం.. అలాగే దాని వల్ల ఏర్పడిన కాంట్రవర్సీ వల్ల ఈ మూవీకి ఒక రేంజిలో పబ్లిసిటీ అనేది బాగా జరిగింది. ప్రేక్షకులకు ఈ సినిమాపై భారీ అంచనాలను కలిగించింది. ఇక అల్లం అర్జున్ ప్రసాద్ అనే పాత్రలో విశ్వక్ సేన్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు.ఇక 33 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి కానీ యువకుడిలా అతను ఆ పాత్రకి బాగా జీవం పోసాడు. రుక్సర్ ధిల్లాన్ అతనికి జోడీగా హీరోయిన్ గా నటించింది.మొదటి షోతోనే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ నే రాబట్టుకుంది.



ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది.వీక్ డేస్ లో కూడా ఈ సినిమా డీసెంట్ గా అనిపించింది.కానీ సూపర్ స్టార్ 'సర్కారు వారి పాట' సినిమా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా సునామీలో రావడంతో ఈ సినిమా ఆ సునామీలో కొట్టుకుపోయింది. ఒకసారి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే..'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాకి రూ.5.96 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఖచ్చితంగా రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.4.47 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో రూ.1.53 కోట్ల నష్టాలతో ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్ మిగిలి ప్లాప్ గా నిలిచింది.ఈ సినిమా పై పాపం విశ్వక్ సేన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. స్టార్ గా ఓ మంచి గుర్తింపు వస్తుందని ఆశపడ్డాడు. కానీ ఈ సినిమా ప్లాప్ గా నిలిచి విశ్వక్ సేన్ ఆశలను ఆవిరి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: