తెలుగు హీరోలకు బాలివుడ్ సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఎంతో మంది హీరోలు బాలివుడ్ లో సినిమాలు చేస్తున్నారు..అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోకు బాలివుడ్ లో సినిమా ఆఫర్ వచ్చింది.ఆ సినిమాకు ప్రముఖ హీరో డైరెక్ట్ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్‌ఖాన్‌ హీరోగా 'కభీ ఈద్‌ కభీ దివాళి' అనే సినిమా చేస్తున్నాడు.వెంకటేష్ తో సల్మాన్ ఖాన్ కి ఉన్న అనుబంధం గురించి అందరికి తెలిసిందే.వీరిద్దరూ మంచి స్నేహితులు..వీరిద్దరు ఒకరి సినిమాలకు మరొకరు ప్రమోట్ చేసుకోవడం విశేషం..


వారిద్దరి మధ్య వున్న ఫ్రెండ్షిప్ తో వెంకటేష్ ని ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయమని అడిగాడట సల్మాన్. అందుకు వెంకటేష్ కూడా ఒప్పుకున్నాడు. దీంతో 'కభీ ఈద్‌ కభీ దివాళి' సినిమాలో వెంకటేష్ కూడా నటించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది..రెండో షెడ్యూల్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. అయితే,తాజాగా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి డైరెక్టర్ ఫర్హాద్‌ సమ్జీ తప్పుకున్నారని సమాచారం. గత ఏడాది అక్టోబర్‌లో 'కభీ ఈద్‌ కభీ దివాళి' సినిమా ప్రారంభమైంది.అయితే కరోనా కారణంగా బ్రేక్ పడి మళ్ళీ ఇటీవలే మొదలైంది. మొదటి షెడ్యూల్ అవుట్‌పుట్‌ చూసిన సల్మాన్‌ఖాన్‌ అది నచ్చలేదని తెలిపి మళ్ళీ రీషూట్ చేద్దామని నిర్మాతని అడిగాడట..అందుకు డైరెక్టర్ ఫర్హాద్‌ సమ్జీ అవమానంగా ఫీల్ అయి దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారని తెలుస్తుంది.గత కొన్ని రోజులుగా 'కభీ ఈద్‌ కభీ దివాళి’ సినిమా దర్శకత్వ వ్యవహారాలను సల్మాన్‌ఖాన్‌ చూస్తున్నాడట. ఈ సినిమాని దర్శకుడి సహాయం లేకుండా తనే డైరెక్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడట సల్మాన్ ఖాన్. దీంతో బాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమాని సల్మాన్ ఖాన్ డైరెక్ట్ చేయబోతున్నాడు..మరి సినిమా సినీ జనాలను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: