పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్నా, మధ్యలో అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. 50 శాతం మేర షూటింగ్ పూర్తి అయిన తర్వాత నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే మళ్ళీ తిరిగి ప్రారంభం అయ్యింది.  తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి కూడా అయ్యింది.  

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. కాకపోతే ఈ సినిమా బడ్జెట్ మాత్రం అవధులు దాటి పోయింది అని తెలుస్తోంది. మొదట సినిమా కథ అనుకుని సెట్స్  పైకి వెళ్లేటప్పుడు ఈ సినిమాను  150 నుండి 180 కోట్ల మధ్యలో పూర్తిచేయాలని చిత్ర బృందం ప్రణాళికలను వేసుకున్నట్లు తెలుస్తోంది.  కాకపోతే ఆ తర్వాత సినిమా షూటింగ్ వాయిదా పడడం, మరి కొన్ని కారణాల వల్ల ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల వరకు చేరనుందని ట్రేడ్ వర్గాల అంచన. హరిహర వీరమల్లు మూవీ  పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతూ ఉండడం,  భారీ పీడియాడిక్ సినిమా కావడం వల్ల సెట్స్ కోసం, గ్రాఫిక్స్ కోసం ఈ మూవీ కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందట. 

ఇలా హర హర వీరమల్ల సినిమా బడ్జెట్ అనేక కారణాల వల్ల అధికంగా పెరిగి పోయిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మొట్ట మొదటి సారి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానుల
తో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలను పెట్టుకున్నారు.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా,  మరో ముఖ్యమైన పాత్రలో నోరా ఫతేహి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: