ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు అన్నీ కూడా వచ్చేశాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఆయన ఏ స్థాయిలో సినిమా చేస్తాడో అన్న క్లారిటీ ఎవరికీ లేకపోవడంతో ఎన్టీఆర్ తదుపరి సినిమా ఏమై ఉంటుందా ఎప్పుడు ఉంటుందా అన్న విమర్శలు కూడా బాగానే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అభిమానులు సైతం ఎంతో అసహనంగా ఫీలయ్యారు. ఎన్టీఆర్ సినిమా ఎవరితో ఉంటుందో అన్న కన్ఫ్యూజన్ లో వారు ఉన్న నేపథ్యంలో కొరటాల శివ మరియు ప్రశాంత్ కు సంబంధించిన అప్డేట్ రావడం అందరినీ ఎంతగానో ఖుషీ చేశాయి.

కొరటాల శివ దర్శకత్వం లోని సినిమా ఎప్పుడో ఒకే అయినా కూడా ఆయన సినిమా ఫ్లాప్ అవ్వడం అందరిని ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో కలవరపరిచింది. ఆ సినిమా యొక్క ప్రభావం ఎన్టీఆర్ సినిమా పైన ఉంటుందా అన్న అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే ఎన్టీఆర్ ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం వదులు కోలేదు. గతంలో జనతాగ్యారేజ్ సినిమా చేసిన దర్శకుడు కావడంతో ఈ చిత్రం కూడా చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. 

అంతేకాదు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సినిమాలో కూడా ఓకే చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు వాస్తవానికి ఈ సినిమా ఇప్పట్లో ఉండదు అని అనుకున్నారు కానీ అనూహ్యంగా ఈ సినిమా ప్రకటన కూడా చేయడం ఎన్టీఆర్ గట్టిగానే ఉందని చెప్పడానికి నిదర్శనం. అయితే అందరూ చెప్పుకున్నట్లుగా నే ఎన్టీఆర్ 31వ సినిమా బుచ్చిబాబు కాకపోవడం కొంతమంది నిరాశపరిచింది. స్పోర్ట్స్ డ్రామా కావడం ఈ చిత్రం ఎప్పుడు కూడా ఎన్టీఆర్ చేయకపోవడం వల్ల ఈ తరహా సినిమా చేస్తే బాగుంటుంది అని అందరూ భావించారు కానీ ఎన్టీఆర్ సినిమా వైపు మొగ్గు చూపడం జరిగింది. మరి ఈ సినిమా ఉందో లేదో అన్న విషయాన్ని కూడా ఇప్పటిదాకా ప్రకటించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: