విజయ్
దేవరకొండ హీరోగా
ఖుషి అనే
సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో
సమంత కథానాయిక గా నటిస్తుండగా
రొమాంటిక్ ప్రేమ కథగా ఈ
సినిమా తెరకెక్కుతోంది.
మహానటి సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న
సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ స్థాయిలోనే అంచనాలు నెలకొన్నాయి. ఆ విధం గా
ఖుషి అనే టైటిల్ ను ఇటీవలే రివీళ్ చేసిన చిత్ర బృందం
సినిమా పై అంచనాలను భారీ స్థాయిలో పెంచింది అని చెప్పాలి.
చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది.
కాశ్మీర్ లో పలు కీలక ఘట్టాలు తెరకెక్కుతున్నాయి. ఆ తర్వాత
జూన్ రెండో వారం నుంచి ఈ
సినిమా కు సంబంధించిన తదుపరి షెడ్యూల్
హైదరాబాద్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇది ఏకంగా పది రోజుల షెడ్యూల్ అని చెబుతున్నారు. మరి ఈ
సినిమా పై ఎంత నమ్మకం లేకుంటే ఈ సమయంలో విజయ్
దేవరకొండ ఈ సినిమాను ఒప్పుకుంటాడు.
దర్శకుడు
శివ నిర్వాణ కు దీనికంటే ముందు చేసిన సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్నాడు. దాంతో ఈ
సినిమా చేయాలా వద్దా అన్న మీమాంసలో అంద రూ ఉన్నారు. అయితే దర్శకుడు ఏ విధంగా ఈ
సినిమా ను ఒప్పించాడో తెలియదు కానీ ఈ
సినిమా చేయడం విజయ్
దేవరకొండ తీసుకున్న కీలకమైన నిర్ణయం అనే చెప్పాలి.
డిసెంబర్ 23వ తేదీన ఈ సిని మా విడుదల కాబోతోంది. దానికంటే ముందు లైగర్ చిత్రం విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్
సినిమా తర్వాత చేస్తున్న ఈ
ప్రేమ కథ సినిమా ఏ విధంగా ప్రేక్షకులు స్వాగతిస్తారో చూడాలి.ఈ చిత్రం తర్వాత అయన చేసే సినిమాలు ఏ స్థాయి లో ఉంటాయో చూడాలి.