ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కే రెండు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చాయి. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ రెండు అప్డేట్ లు కూడా సంచలనం సృష్టించే అప్డేట్లనే చెప్పాలి. చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ నటించబోయే తదుపరి సినిమాల గురించి ఎన్నో రకాల విమర్శలు ఎదురయ్యాయి. ఆయన నటించబోయే తదుపరి చిత్రం ఇప్పటి దాకా కూడా ఓకే కాకపోవడంతో చాలామంది ఎన్టీఆర్ పై విమర్శలు చేశారు. ఒకానొక దశలో ఎన్టీఆర్ పై ఆయన అభిమానులు సైతం డైరెక్ట్ గా సినిమా ప్రకటన ఎప్పుడో అన్న ప్రశ్నలను సంధించారు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు ఆయన పుట్టినరోజునాడు వెలువడతాయని చెప్పగా 20 వ తేదీన ఆయన నటించబోయే తదుపరి రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు వచ్చాయి. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా ఎన్టీఆర్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఉండగా 31వ సినిమాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ఒకే అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాల అప్డేట్లు రావడం ఒక్కసారిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమను షేక్ చేసింది అని చెప్పాలి. 

దాంతో పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమను కూడా ఈ రెండు చిత్రాల అప్డేట్లు షేక్ చేశాయి. ఒక్కసారిగా ఈ సినిమాలు రాబోతున్నాయి అని చెప్పడంతో ఈ రకమైన బజ్ సినిమా కోసం ఏర్పడింది. సినిమాలకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతాయో చూడాలి. ముందుగా కొరటాల శివ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా అవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా యూనిట్ ప్రణాళికలు వేసుకుంటోంది. మరి ఈ ఏడాది ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పలకరించిన ఎన్టీఆర్ వచ్చే ఎదాది ప్రేక్షకులను ఏ స్థాయి లో అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: