అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ఎఫ్3. ఎఫ్ 2 సినిమా కి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మే 27వ తేదీన విడుదల కాబోతున్న చిత్రమైన ఎఫ్3 ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ ప్రేక్షకుల ముందుకు రావాల్సిన భారీ చిత్రాలు విడుదల జరగడంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇప్పుడు సిద్ధమయ్యింది.

నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించే నిర్మాత గా పేరున్న దిల్ రాజు ఈ సినిమా తో మరోసారి ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్  కార్యక్రమాలను పూర్తి చేసుకుంది యూనిట్. ఈ నేపథ్యంలో క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేయడం ఒక్కసారిగా సినీ వర్గాలను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా అయినా కూడా ఈ చిత్రంలో కొన్ని ఆకర్షణీయమైన ఎలిమెంట్స్ ఉంటాయి.

అంతే కాదు డబల్ మీనింగ్ డైలాగులు కూడా ఉంటాయి. నిజానిక సెన్సార్ సభ్యులకు ఏమాత్రం అనుమానం వచ్చినా యు/ ఎ సర్టిఫికెట్ ఇవ్వడానికి వెనకాడరు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి యు సర్టిఫికెట్ ఇవ్వడం కొంతమందిని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. యు సర్టిఫికెట్ అంటే క్లీన్ సినిమా అని ఎటువంటి గ్లామరస్ పాత్రలు ఉండవు. ఈరోజుల్లో అందరూ ఈ తరహా పాత్రలు పెడుతున్నారు. ఈ సినిమాలో ఉంటాయని అనుకున్నారు. అలాంటి ఈ చిత్రానికి యూ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో తమన్నా మరియు మెహర్ మెహర్ కథానాయికలు గా నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: