మంచి మ్యాటర్, మంచి టాలెంట్ ఉండి కూడా సరైన సక్సెస్ రాకపోతే కలిగే బాధ ఇంకా అలాగే ఎదిగే అవకాశం ఉండి కూడా సరిగ్గా ఎదగలేకపోతే రగిలే ఆవేదన..ఈ రెండు కూడా అసలు మాటల్లో చెప్పుకునేది తీరిపోయే కాదు. ఆ బాధ ఆవేదన రెండూ కూడా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ జీవితంలో నిత్యం కూడా పోటీ పడుతూ ఉంటాయి. ఒక్క బొమ్మరిల్లు తప్ప, ఆయన తీసిన ఏ సినిమా కూడా బాగున్నా కానీ ఆశించిన స్థాయిలో హిట్ మాత్రం కాలేదు.అలాగే ఎప్పటి నుంచో మరో భారీ హిట్ కొట్టి, తన చిరకాల కోరిక తీర్చుకుని స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో సగర్వంగా తన పేరును కూడా చూసుకోవాలని బొమ్మరిల్లు భాస్కర్ ఎంతో ఆశ పడుతున్నాడు. కానీ, అంత పెద్ద హిట్ మాత్రం ఆయనకు అసలు రావడం లేదు. దాంతో ఆయన తన తర్వాత సినిమా ఏం చేయాలి అనే క్వశ్చన్ దగ్గరే ఎంతో మధనపడి, ఇక మొత్తానికి టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో చైతుతో ఒక సినిమాని ఎలాగోలా సెట్ చేసుకున్నాడు.ఇక నాగచైతన్య తన కొత్త సినిమా 'థ్యాంక్ యూ' సినిమాను దాదాపు పూర్తి చేశాడు. అలాగే వెంకట్ ప్రభుతో కూడా ఓ సినిమా కమిట్ అయ్యాడు.



త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళనుంది. అలాగే, దర్శకుడు పరశురామ్ పెట్లతో దర్శకత్వంలో కూడా చైతు ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఖరారైంది కూడా.ఇక చైతు ఇంత బిజీగా ఉండి కూడా.. ఇప్పుడు మరోక సినిమాని ఒకే చేశాడు. ఎట్టకేలకు బొమ్మరిల్లు భాస్కర్ తో చైతు సినిమా ఓకే అయ్యింది. ఎకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ సినిమాని నిర్మించబోతుంది. ఇక చైతూ తమ్ముడు అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని బొమ్మరిల్లు భాస్కర్ ప్రయత్నం చేశాడు. ఆ సినిమాతో ఫామ్ లోకి రాకపోయినా.. ఎలాగోలా పాపం ఏవరేజ్ హిట్ అందుకున్నాడు.ఫర్వాలేదు అనిపించుకున్నాడు.అందుకే, యువ సామ్రాట్ నాగచైతన్య వెంటనే భాస్కర్ కి డేట్లు ఇచ్చేశాడు. ఈ సినిమా ఒక మంచి యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. మరో ఐదు నెలల్లో ఈ సినిమా కథ కూడా అంతా పూర్తవుతుంది. ఇప్పటికే కథని కూడా లాక్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలని చిత్ర బృందం వారు వెల్లడిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: