అప్పుడప్పుడు కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడీ లేకుండా విడుదల అవుతూ ఉంటాయి. అలా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడీ లేకుండా విడుదల అయిన కొన్ని సినిమాలు మౌత్ టాక్ తో మంచి కలెక్షన్లను తెచ్చుకొని అతి తక్కువ కాలంలోనే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్బస్టర్ విజయాలను అందుకుంటూ వుంటాయి. ప్రస్తుతం అలాంటి లిస్ట్ లోకి శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన కాలేజ్ డాన్ మూవీ చేరిపోయింది. శివ కార్తికేయన్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సీబీ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన కాలేజ్ డాన్  మూవీ మే 13 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యింది.

ఈ సినిమాలో తెలుగులో ఎలాంటి ప్రచారాలు లేకుండా నేరుగా థియేటర్లలో విడుదల చేశారు. అలా ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా థియేటర్లలో విడుదల అయిన కాలేజ్ డాన్ మూవీ విడుదలైన మొదటి రోజు నుండి మంచి టాక్ ను తెచ్చుకుంది అదిరిపోయే కలెక్షన్లను అందుకుంటోంది.  పది రోజుల బాక్సాపీస్ రన్ కంప్లీట్  పూర్తయ్యేసరికి కాలేజ్ డాన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం.
నైజాం : 73 లక్షలు
సీడెడ్ :  24 లక్షలు
యూ ఎ : 26 లక్షలు
ఈస్ట్ : 13 లక్షలు
వెస్ట్ : 9 లక్షలు
గుంటూర్ : 9 లక్షలు
కృష్ణ : 10 లక్షలు
నెల్లూర్ : 7 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల బాక్సాపీస్ రన్ కంప్లీట్ కంప్లీట్ అయ్యేసరికి కాలేజ్ డాన్ మూవీ  1.71 కోట్ల షేర్ , 3.40 కోట్ల  గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.


ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.3 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 1.5 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలో దిగింది. 1.5 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ సినిమా పది రోజుల పది రోజుల బాక్సాఫీస్ పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని 21 లక్షల రూపాయల లాభాలను రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకని క్లీన్ హిట్ గా నిలిచింది.  ప్రస్తుతం కూడా ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: