బోయపాటి శీను డైరెక్టర్ గా మరియు బాలయ్య హీరోగా వచ్చిన హ్యాట్రిక్ 'అఖండ'. ఈ సినిమా ఎంతటి ప్రభంజనంన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమాల విషయంలో జోరు పెంచాడు. కాగా వరుసగా గోపీచంద్ మలినేని తో ఒకటి మరియు అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతానికి బాలయ్య గోపిచంద్  మలినేని సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం పట్టేలా ఉంది. ఈ లోపు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ అంతా పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ యాక్షన్ మూవీ గా రానుందని తెలుస్తోంది.

అయితే అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఎఫ్ 2 సీక్వెల్ మూవీ ఎఫ్ 3 ఈ వారమే రిలీజ్ అవుతోంది. కాబట్టి ఈ సినిమా ప్రమోషన్ లో అంతా తలమునకలై ఉన్నారు. ఆ తర్వాత బాలయ్య సినిమా పనులు మొదలెడతారట.   అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య కు కూతురు పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. అందుకోసం ఈ పాత్రలో నటించడానికి ఈ మధ్యనే పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన శ్రీలీలను తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి కంఫర్మ్ చేయడమా విశేషం.

శ్రీలీల తాను నటించిన మొదటి సినిమాతోనే నటనలో మంచి పేరును తెచ్చుకుని దర్శకుల కళ్లలో పడింది. అందుకే తన ఖాతాలో రవితేజ సినిమా మినహా కొన్ని ఆఫర్ లు ఉన్నాయి. ఈ సినిమాలో కనుక శ్రీలీల మంచిగా నటిస్తే పెద్ద పెద్ద బ్యానర్ లలో అవకాశాలు వస్తాయి. మరి అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న శ్రీలీల ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: