రెండు రోజుల క్రితం ముగిసిన బిగ్ బాస్ ఓ టి టి మొదటి సీజన్ లో బిగ్ బాస్ రియాలిటీ షో చరిత్రలోనే రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు తెలుగులో అయిదు సీజన్ లు ముగిశాయి. కానీ ఏ సీజన్ లోనూ మహిళ బిగ్ బాస్ విన్నర్ అయింది లేదు. కానీ ఈ శనివారం మాత్రం మొట్టమొదటిసారి బిందు మాదవి అనే ఆడపులి బిగ్ బాస్ టైటిల్ గెలిచి సత్తా చాటింది. తెలుగు అమ్మాయిగా కెరీర్ స్టార్ట్ చేసిన బిందు మాదవి కొన్ని సినిమాలు చేసినా సెటిల్ కాలేకపోయింది. దీనికి ప్రధాన కారణం గ్లామర్ గా లేకపోవడమే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఆ తర్వాత ఇండస్ట్రీ నుండి కనుమరుగైపోయింది. సరిగ్గా 12 వారాల క్రితం బిగ్ బాస్ ఓటిటి లో ప్రత్యక్షము అయింది.

అయితే అందరి లాగే ఇంటిలోకి ప్రవేశించిన బిందు మాదవి అంచనాలకు మించి రాణిస్తూ చివరికి తనకంటే స్ట్రాంగ్ కంటెస్ట్ లుగా ఉన్న ఎందరినో దాటుకుని టైటిల్ ను ఎగరేసుకుపోయింది. దీనితో ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. అవకాశాలు కూడా వెల్లువలా వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. కానీ వేటికీ అధికారిక సమాచారం లేదు. అదే విధంగా ఇప్పుడు మరొక ఆఫర్ బిందు మాధవికి వచ్చినట్లు సినిమా వర్గాల నుండి సమాచారం అందుతోంది.

అనిల్ రావిపూడి సినిమాలో ఒక ఆఫర్ వచ్చినట్లుగా చెబుతున్నారు. అనిల్ రావిపూడి టాలెంట్ ఉన్న వాళ్లకు ఆఫర్ లను ఇవ్వడంలో ముందుంటాడు. అందుకే తన ఎనర్జీ, పోటీతత్వం చూసిన అనిల్ రావిపూడి బాలకృష్ణ తో తీయబోయే సినిమాలో ఒక మంచి పాత్రను ఇస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో యువనాయిక శ్రీలీల ఒక పాత్రా చేస్తుండగా మరో పాత్రలో బిందు మాదవి నటించనుందని సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: