టాలీవుడ్ యంగ్ టైగర్ అయిన తారక్..వరుస సినిమాలకు కమిట్ అవుతూ..ఫ్యాన్స్ ని బాగా ఉత్సాహపరుస్తున్నాడు. రీసెంట్ గా rrr సినిమా తో మంచి విజయం అందుకున్న తారక్..ఆ తరువాత డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ తో ఓ సినిమా ..అలాగే ..బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా ఫిక్స్ అయ్యాడని సమాచారం.



ఇద్దరు బడా డైరెక్టర్ల దర్శకత్వంలో సినిమా వస్తుంది అని తెలిసిన అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.

 

ఈ సినిమాలకి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారట.ఈ క్రమంలోనే రీసెంట్ గా తారక్ పుట్టిన రోజు సంధర్భంగా..NTR 30 నుండి కొరటాల..NTR31 నుండి ప్రశాంత్ నీల్ క్రేజీ అప్ డేట్స్ ఇచ్చి..తారక్ బర్తడే ని మరింత స్పెషల్ చేశారని తెలుస్తుంది.. కాగా, మరి కొన్ని రోజుల్లోనే తారక్, కొరటాల చిత్రం లాంఛనంగా ప్రారంభం అవుతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

 

ఈ క్రమంలోనే సినిమా లో తారక్ కు జోడీగా నటించే హీరోయిన్ల పేరు తెగ వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ నుండి సినిమాలో అలియా అనుకున్నారట...ఆ తరువాత దిపీకా ఫిక్స్ అంటూ కూడా టాక్ వినపడింది. లాస్ట్ కి రష్మిక అండ్ సాయి పల్లవి కూడా అన్నారు. ఇవన్ని కాకుండా ఇప్పుడు తెర పైకి ఓ క్రేజీ హీరోయిన్ పేరు వచ్చిందట .బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండేసినిమా తారక్ తో రొమాన్స్ చేయనుందని కాకపోతే సెకండ్ హీరోయిన్ గా మాత్రమే ఆమె మనకు తెర పై కనిపిస్తుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీని పై తారక్ ఫ్యాన్స్ సముఖంగా లేరట సినిమాలో సాయిపల్లవి, రష్మిక నే బాగుంటారు..ఆ బాలీవుడ్ పాప మనకి వద్దు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఎవరి ని కన్ఫర్మ్ చేస్తారో

 .

మరింత సమాచారం తెలుసుకోండి: