ఇప్పటికీ మన సమాజంలో కొన్ని దురాచారాలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి పుట్టబోయే బిడ్డ అమ్మాయి అని తెలిస్తే ఆపరేషన్ చేయించడం లేదా పుట్టినా చెత్త బుట్టలో పడేయడం లాంటివి. ఎందుకు మహిళలలపై అంత చిన్న చూపు. నేడు మహిళలు పురుషులతో సమానంగా అన్నిటిలోనూ దూసుకుపోతున్నారు. అయినప్పటికి ఈ వివక్ష తగ్గడం లేదు. ఇదిలా ఉంటే ఇదే విధమైన సంఘటన ఒకటి ప్రముఖ సినీ నటి జీవితంలో జరిగిందట. అయితే తన బిడ్డలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ సమాజం మరియు ఫ్యామిలీ నుండి మాత్రం బాధలను ఎదుర్కొందని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు సీతాకోకచిలుక సినిమాతో హీరోయిన్ గా అరంగ్రేటం చేసి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ముచ్చర్ల అరుణ.

ఈమె తెలుగు నటి అయినా నాలుగు భాషలలో సినిమాలు చేసిన ఔరా అనిపించుకుంది. నటిగా మంచి డిమాండ్ ఉన్న సమయంలోనే ఒక వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. అలా తనకు మొదట కూతురు పుట్టింది.. అప్పుడే తన అమ్మ మరియు అత్త కొంచెం ఇబ్బంది పడ్డారు. మొదటి బిడ్డ కొడుకు అయితే బాగుండేది అని నసిగారు. సరేలే తర్వాత అయినా పుడతాడు అనుకుని సర్దుకున్నారు. కానీ ఏకంగా మొత్తం నలుగురు బిడ్డలు ఆడపిల్లలే పుట్టారు. దీనితో ఇరు కుటుంబాలలో శాంతి అనేది కరువైంది. కొడుకు పుట్టలేదని అత్త అమ్మ లు ఏవేవో మాటలు అనడం..బాధపడడం చేస్తూ ఉన్నారు.

అయినా అరుణ భర్త మాత్రం తనను ఒక్క మాట కూడా అనకుండా దేవుడిచ్చిన నలుగురు బిడ్డలను ఒకేరకంగా పెంచాడు. అప్పట్లో ఇంటి నుండి మాత్రమే కాకుండా బయట వారి నుండి కూడా కొన్ని సూటిపోటి మాటలను ఎదుర్కొంది. ఆడపిల్లలు కనడం మాచేతుల్లో ఉంటుందా ? ఎందుకు ఈ సమాజం మమ్మల్ని అర్ధం చేసుకోదు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వేదనను పంచుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: