జనసేన కోసం అందరూ కలిసొస్తామంటూ మెగా ఫ్యాన్స్ పేరుతో ఇటీవల ఓ మీటింగ్ జరిగింది. అయితే ఆ మీటింగ్ లో ఓ వ్యక్తి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ గురించి ప్రస్తావిస్తూ.. చెప్పను బ్రదర్, మాట్లాడను బ్రదర్ అన్న వ్యక్తి సినిమాలు మేము చూడము బ్రదర్ అని చెప్పారాయన. అయితే అక్కడ ఉన్న కొందరు అభిమానులు కూడా చప్పట్లతో అతడి స్పీచ్ ని మెచ్చుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు పైర్ అయిపోతున్నారు.

సినిమా హీరోలు అంతా ఒకటే, మధ్యలో ఫ్యాన్స్ గొడవపడిపోతుండారు. అలాంటిది ఒకే ఫ్యామిలీనుంచి వచ్చిన హీరోల మధ్య గ్యాప్ ఎందుకు ఉంటుంది చెప్పండి. మెగా హీరోలు ఎప్పటికీ ఒకటే, కానీ మెగా ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో రచ్చ రచ్చ చేసేశారు. బ్యానర్లో కూడా అల్లు అర్జున్ ఫొటో వేయలేదు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, నాగబాబు ఫొటోలు మాత్రమే పెట్టుకున్నారు. కానీ మీటింగ్ లో అల్లు అర్జున్ ప్రస్తావన తేవడం కూడా అనవసరం. కానీ ఆ ప్రస్తావన తెచ్చి మరీ ఆయన్ను అవమానించినట్టయింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏం పీకలేరు బ్రదర్ (#EmPeekaleruBrother) అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

మెగా సపోర్ట్ లేకపోయినా అల్లు అర్జున్ ని ఎవరూ ఏం చేయలేరని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సినిమాలు నార్త్ లో ఫ్లాప్ అయ్యాయని, కానీ అల్లు అర్జున్ మూవీ మాత్రం ఎక్కడా ఫ్లాప్ కాలేదని.. ఇలా రకరకాల ఉదాహరణలు చూపిస్తున్నారు. మొత్తమ్మీద ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ఫొటోలను మార్ఫింగ్ చేసి మరీ మెగా ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.

గతంలో ఓ సినిమా ఫంక్షన్లో పవన్ కల్యాణ్ పేరు చెప్పాలని గోల చేస్తున్న అభిమానులకు. చెప్పను బ్రదర్ అంటూ షాకిచ్చారు అల్లు అర్జున్. అప్పటినుంచి బన్నీ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కలయిక అంటూ మీటింగ్ పెట్టుకుని మెగా వార్ కి తెరలేపారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ ఫ్యాన్ వార్ లో హీరోలు కలుగజేసుకుంటారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: