మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ తాజాగా విడుదలయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నరు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే రామ్ చరణ్ కొత్త సినిమా లను లైన్ లో పెడుతూ ముందుకు దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే రామ్ చరణ్ , శంకర్ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు. 

సినిమా తర్వాత రామ్ చరణ్ , సుకుమార్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే సుకుమార్ తో సినిమా పూర్తి కాగానే తమిళ క్రేజీ దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తేజ కే జి ఎఫ్ మూవీ తో పాన్  ఇండియా రేంజ్ లో దర్శకుడిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ ఒక మూవీ ని సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా రామ్ చరణ్ వరుస  పెట్టి క్రేజీ దర్శకులు లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: