లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. తమిళ క్రేజీ దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన మానగరం, ఖైదీ , మాస్టర్ మూవీ లు బాక్స్ ఆఫీస్  దగ్గర మంచి విజయం సాధించడంతో సినీ ప్రేమికులు విక్రమ్ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. విక్రమ్ మూవీ పై తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి అంచనాలు కలిగి ఉన్న విక్రమ్ సినిమా తెలుగు హక్కులను టాలీవుడ్ హీరో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట మూవీస్ దక్కించుకుంది. విక్రమ్ సినిమా తెలుగు హక్కులను శ్రేష్ట మూవీస్ భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.  కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. రామ్ చరణ్ విడుదల చేసిన విక్రమ్ సినిమా ట్రైలర్ కు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. 

విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి ,  ఫాహాద్ ఫాసిల్ ముఖ్య పాత్రల్లో నటించగా,  సూర్య గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే విక్రమ్ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ఈ సినిమా రన్ టైమ్ ను తాజాగా లాక్ చేసినట్లు తెలుస్తోంది. విక్రమ్ సినిమా రన్ టైమ్ ను 2 గంటల 53 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం. ఇలా విక్రమ్ సినిమా కోసం చాలా లేంతి రన్ టైమ్ చిత్ర బృందం లాక్ చేసినట్లు తెలుస్తోంది. మరి విక్రమ్ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: