దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్ధార్థ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించిన బొమ్మరిల్లు భాస్కర్ 'బొమ్మరిల్లు' మూవీ లో ఇటు ప్రేమను... అటు ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలగలిపి ఈ మూవీ ని తెరకెక్కించాడు. బొమ్మరిల్లు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటు దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ కు కూడా మంచి గుర్తింపును తీసుకువచ్చింది. 

అలా బొమ్మరిల్లు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న బొమ్మరిల్లు భాస్కర్ ఆ తర్వాత అనేక సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ బొమ్మరిల్లు రేంజ్ విజయాన్ని మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోయాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం బొమ్మరిల్లు భాస్కర్ , అఖిల్ అక్కినేని హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా విజయం తో బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. 

ఇది ఇలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ మరో అక్కినేని హీరో తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్,  నాగ చైతన్య తో ఒక సినిమా చేయబో తున్నట్లు తాజా సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే బొమ్మరిల్లు భాస్కర్, నాగ చైతన్య కు ఒక కథను వినిపించినట్లు,  ఆ కథ బాగా నచ్చడంతో నాగ చైతన్య వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ ని 14 రీల్స్ బ్యానర్ వారు నిర్మించినున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: