'బాహుబలి' బ్లాక్‌బస్టర్‌తో ప్రభాస్‌ ఆలిండియా స్టార్‌ అయ్యాడు. 1500 కోట్లకి పైగా వసూళ్‌ చేసి టాప్‌ హీరో అయ్యాడు. ఇక ఈ బ్లాక్‌బస్టర్‌తో టాలీవుడ్‌తో పాటు హిందీలోనూ నం.1 హీరో అనిపించుకున్నాడు. అప్పటి వరకు టాప్‌ రేసులో ఉన్న పవన్‌ కళ్యాన్‌, మహేశ్‌ బాబు లాంటి హీరోలని వెనక్కినెట్టి టాప్‌ చైర్‌కి దగ్గరయ్యాడు. ప్రభాస్‌కి 'బాహుబలి' తర్వాత మళ్లీ ఆ రేంజ్‌ హిట్స్‌ రాలేదు. సుజిత్ దర్శకత్వంలో చేసిన 'సాహో' సినిమాకి తెలుగునాట మిక్స్‌డ్ రెస్పాన్స్‌ వచ్చింది. హిందీ బెల్ట్‌లో సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత రాధాక్రిష్ణ కుమార్‌ దర్శకత్వంలో చేసిన 'రాధేశ్యామ్' డిజాస్టర్ అయ్యింది. తెలుగు, హిందీ రెండు చోట్లా ఫ్లాప్‌ అయ్యింది.

'బాహుబలి'తో ప్రభాస్‌ గ్రాఫ్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్తే, ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ప్రభాస్‌ మార్కెట్‌ని గట్టిగా దెబ్బకొట్టాయి. 'రాధేశ్యామ్'కి అయితే మినిమం కలెక్షన్లు కూడా రాలేదు. దీంతో రెబల్‌స్టార్ హవా తగ్గిపోయిందనే కామెంట్స్‌ వస్తున్నాయి. అలాగే జూ.ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ నుంచి టఫ్‌ కాంపిటీషన్ ఎదురవుతోందని చెప్తున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' హిట్‌తో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ఇద్దరికీ బాలీవుడ్‌లో మంచి గుర్తింపు వచ్చింది. ఈ స్టార్డమ్‌ని మరింత పెంచుకోవడానికి పాన్‌ ఇండియన్ మూవీస్ చేస్తున్నారు. చరణ్‌ ఆల్రెడీ శంకర్‌ డైరెక్షన్‌లో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. ఈ మూవీలో చరణ్‌ డ్యుయల్‌ రోల్‌ ప్లే చేస్తాడని, అర్బన్‌, రూరల్‌ లుక్స్‌లో ఇంప్రెస్‌ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. నెక్ట్స్‌ గౌతమ్‌ తిన్ననూరితో ఒక సినిమా చేయబోతున్నాడు.

జూ.ఎన్టీఆర్ కూడా 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత పాన్‌ ఇండియన్ మూవీస్‌ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో నేషనల్ లెవల్లో రిపేర్‌ చేస్తామని ఒక మూవీ అనౌన్స్ చేశాడు. అలాగే ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ఒక సినిమా చేయబోతున్నాడు తారక్. 'సలార్' తర్వాత తారక్, ప్రశాంత్‌ నీల్‌ సినిమా స్టార్ట్‌ కాబోతోంది. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ఇద్దరూ 'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్‌ని కంటిన్యూ చేస్తూ, భారీ హిట్స్‌ కొడితే నంబర్‌ గేమ్‌లోనూ ముందుకెళ్లే అవకాశముంటుంది. అయితే రాజమౌళి సినిమా తర్వాత హీరోలకి ఫ్లాప్‌ వస్తుందనే సెంటిమెంట్‌ ఉంది. వీళ్లిద్దరు ఈ సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేస్తే నంబర్‌ గేమ్‌లో దూకుడు చూపించే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: