అల్లు అర్జున్‌ 'పుష్ప'తో హిందీలో క్రేజీ రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. ఫైర్‌స్టార్‌ పుష్పగా మాస్‌కి స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయ్యాడు. దీంతో హిందీ జనాలంతా బన్ని పాత సినిమాలని కూడా చూడ్డం మొదలుపెట్టారు. వాటిలో 'అల వైకుంఠపురములో' సినిమాకి ఎక్కువ వ్యూస్‌ వచ్చాయి. రీల్స్‌‌, టిక్‌టాక్‌ల్లో బుట్టబొమ్మ ఫేమస్‌ కావడంతో 'వైకుంఠపురం'ని హిందీ మూవీ బఫ్స్‌ చాలా మంది చూశారు. ఈ సినిమాని ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ 'షెహజాదే'గా రీమేక్ చేస్తున్నాడు.

ఆమిర్‌ ఖాన్ 'గజిని' రీమేక్‌ చేస్తున్న టైమ్‌లోనే హిందీ జనాలకి పరిచయమయ్యాడు సూర్య. ఇక ఎయిర్‌ డెక్కన్‌ 'గోపీనాథ్' కథాంశంతో చేసిన 'సూరారైపోట్రు', జస్టిస్ కె.చంద్రు కథాంశంతో చేసిన 'జై భీమ్' సినిమాలతో మరింత దగ్గరయ్యాడు. డైరెక్ట్‌ ఓటీటీలో రిలీజైన ఈ రెండు సినిమాలకి బాలీవుడ్‌ జనాల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. నార్త్‌లో చాలామంది చూసిన 'సూరారైపోట్రు' సినిమాని అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తున్నాడు.

మాధవన్, విజయ్‌ సేతుపతి హీరోలుగా నటించిన తమిళ హిట్‌ 'విక్రమ్‌ వేద'. పుష్కర్, గాయత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీలో రీమేక్‌ అవుతోంది. సైఫ్‌ అలీఖాన్, హృతిక్‌ రోషన్ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక హిందీలో కూడా 'విక్రమ్‌ వేద' పేరుతోనే డైరెక్ట్‌ చేస్తున్నారు పుష్కర్, గాయత్రి. సౌత్‌ సినిమాలు హిందీలో డబ్‌ అయి భారీగా వసూల్‌ చేస్తున్నాయి. బాలీవుడ్‌ మేకర్స్‌ని కూడా భయపెడుతున్నాయి. అయితే సౌత్‌ సినిమాలని హిందీలో రీమేక్‌ చేసిన హీరోలు మాత్రం ఫెయిల్‌ అవుతున్నారు. రీసెంట్‌గానే అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్‌ ఇద్దరూ రీమేక్‌లతో బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాపడ్డారు.

అల్లరి నరేష్‌ని చాలాకాలం తర్వాత సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కించిన  సినిమా 'నాంది'. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంషలు కూడా దక్కాయి. ఇప్పుడీ కథని హిందీకి తీసుకెళ్లాడు అజయ్‌ దేవగణ్‌. నాని నిర్మాణంలో శైలేష్‌ కొలను దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ నటించిన కాప్‌ స్టోరి 'హిట్‌'. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాడు రాజ్‌ కుమార్‌ రావు. తెలుగులో డైరెక్ట్‌ చేసిన శైలేష్‌ కొలను దర్శకత్వంలోనే హిందీ రీమేక్‌ కూడా తెరకెక్కుతోంది. అక్షయ్‌ కుమార్‌ రీసెంట్‌గా తమిళ హిట్‌ 'జిగర్తాండ'ని 'బచ్చన్‌పాండే'గా రీమేక్ చేశాడు. అయితే ఈ మూవీ హిందీలో ఫ్లాప్ అయ్యింది. అలాగే నాని 'జెర్సి' సినిమాని షాహిద్‌ కపూర్‌ ఇదే పేరు రీమేక్ చేశాడు. ఈ రెండు రీమేకులు బాక్సాఫీస్‌ దగ్గర ఘోరంగా బోల్తాపడ్డాయి. అప్పటికే ఈ సినిమాలని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో చూసిన జనాలు మళ్లీ థియేటర్‌కి రాలేదు. దీంతో వసూళ్లు పడిపోయాయి. మరి ఇప్పుడు సెట్స్‌లో ఉన్న రీమేక్స్‌ ఎలాంటి రిజల్ట్‌ తెచ్చుకుంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: