అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సినిమా ఇండస్ట్రీలో ఏర్పరచుకుంది. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సినిమా ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్న సాయి పల్లవి ఇప్పటి వరకు కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ స్కిన్ షో కు , గ్లామర్ పాత్రలకు , కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉండే సినిమాలలో నటిస్తూ తన కెరియర్ ను ముందుకు సాగుతోంది. 

ఇలా కెరియర్ లో స్కిన్ షో కు, గ్లామర్ పాత్రలకు , కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ తన కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సాయి పల్లవి ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి కి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు సాయి పల్లవి కూడా అదిరిపోయే రేంజ్ లో సమాధానం ఇచ్చింది. అసలు విషయం లోకి వెళితే... తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి కి పుష్ప' మూవీ లోని 'ఊ అంటావా మామ' పాట, 'రంగస్థలం' మూవీ లోని 'జిగేలు రాణి' వంటి ఐటెం సాంగ్స్ లో నటించే అవకాశం వస్తే నటిస్తారా..? అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు సాయి పల్లవి చేయను అని సమాధానమిచ్చింది. ఐటెం సాంగ్ లు తనకు కంఫర్ట్ గా ఉండవు అని తెలియజేసింది. వస్త్రధారణ కనుక సరిగా లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని సాయి పల్లవి తాజా ఇంటర్వ్యూ తెలియజేసింది. ఇలా తాజా ఇంటర్వ్యూలో సాయి పల్లవి తనకు ఐటమ్ సాంగ్స్ లలో నటించే  ఆసక్తి ఏమాత్రం లేదు అనే విషయాన్ని కూడా వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: