సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే.  బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలతో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్న మహేష్ బాబు ఆ తర్వాత భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.  తాజాగా విడుదలైన సర్కారు వారి పాట సినిమాతో మరో విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని మహేష్ బాబు ఈ విజయాల పరంపరను అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు.

ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరో గా నటించబోతున్న విషయం  మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా,  ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే...  త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమా టైటిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఎక్కువ శాతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమా టైటిల్ లో మొదటి అక్షరం అ వచ్చే విధంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అందులో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన  అనేక సినిమాల టైటిల్ లో మొదటి అక్షరం అ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అందులో భాగంగా మహేష్ బాబు తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించబోయే సినిమాలో కూడా మొదటి అక్షరం అ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  అందులో భాగంగా మహేష్ బాబు తో త్రివిక్రమ్ తెరకెక్కించబోయే సినిమాకు అర్జునుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: