టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా , ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలో నుంచి ఒక పాటలో చిత్ర బృందం విడుదల చేయగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.

మూవీ లో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.   ది వారియర్ మూవీ ని జూలై 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది.  ఇది ఇలా ఉంటే  రామ్ పోతినేని టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే కమిట్ ఆయన విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా కొన్ని రోజుల క్రితమే వచ్చింది.  

రామ్ పోతినేని,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ ని తెలుగు,   తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ షూటింగ్ 1 జూన్ 2022 వ తేదీ నుండి గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అఖండ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోయే సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: