టాలీవుడ్ నటుడు అడవి శేషు గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  క్షణం , గూడచారి , ఎవరు వంటి మూవీ లతో అడవి శేషు టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నడు.  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న అడవి శేషు తాజాగా మేజర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమా జూన్ 3 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ కి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. అడవి శేషు , శశికిరణ్ తిక్క కాంబినేషన్ లో ఇది వరకు గూఢచారి మూవీ తెరకెక్కింది. 

గూడచారి సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. మేజర్ మూవీ ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ మూవీస్, జీఎంబీ బ్యానర్‌ల మీద రూపొందించారు. ఈ మూవీ లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా,  శోభితా ధూళిపాళ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  

మూవీ ని 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా మేజర్ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మేజర్ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుండి యూ/ఎ సర్టిఫికెట్ లభించింది.  అలాగే ఈ సినిమా రన్ టైం కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది.  మేజర్ సినిమా రన్ టైమ్ ని 2 గంటల 28 నిమిషాలకు చిత్ర బృందం లాక్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: