పూరి జగన్నాథ్ దర్శకత్వం లో భారీ అంచనాల మధ్య బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న l సినిమా లైగర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు తర్వాత మరో సారి తరుణ్ భాస్కర్ తో ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. ఈ క్రమం లోనే తరుణ్ భాస్కర్ తో విజయ్ దేవరకొండ త్వరలో సినిమా చేయ బోతున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుండి టాక్ వినిపిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమం లో పాల్గొన్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.
ఈ సందర్భం గా తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది. ఈ క్రమం లో భాగంగా అటు దేవరకొండ తో మరోసారి సినిమా ఎప్పుడు చేయబోతున్నావ్ అంటూ అడుగగా.. వరుసగా మూడు ఫ్లాపులు వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ సినిమా చేయబోతున్నా అంట తెలిపాడు. విజయ్ కీ ప్లాపుల అంటూ అలీ పంచ్ వేయగా.. కాదు నాకు ఫ్లాప్ వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండను వైల్డ్ కార్డుగా వాడతాను అంటూ తెలిపాడు..