తెలుగు సినిమాలలో సున్నితమైన హాస్యానికి చిరునామా జంధ్యాల. ఆయన సినిమాలలో బూతులు కానీ మితిమీరిన శృంగార సన్నివేశాలు కాని ఉండవు. జంధ్యాల ఏకలవ్యుడు శిష్యుడుగా తనకు తాను ప్రకటించుకున్న అనీల్ రావిపూడి తాను ఇండస్ట్రీలోకి జంధ్యాల మార్క్ హాస్యంతో సినిమాలు తీయడానికి తాను సినిమా రంగంలోకి వచ్చాను అంటూ అనేక ఉంటార్వ్యూలలో చెప్పాడు.


అయితే ఈవారం విడుదల కాబోతున్న ‘ఎఫ్ 3’ సినిమాలో జంధ్యాల మార్పు కామెడీ కంటే ఈవివి మార్పు కామెడీ కనిపిస్తుంది అంటూ ఇప్పటికే ఈసినిమాను చూసిన సెన్సార్ వర్గాలు కామెంట్స్ చేసినట్లు టాక్. దిల్ రాజ్ ఇస్తున్న లీకులు ప్రకారం ఈ మూవీని లాజిక్ లేకుండా ఎంజాయ్ చేయండి అని ఒకవైపు చెపుతుంటే సెన్సార్ వర్గాల నుండి లీక్ అవుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో తమన్నా సోనాలీ ల ఎక్స్ పోజింగ్ ఒక రేంజ్ లో ఉంటుందట.


అంతేకాదు ఈ మూవీలో ద్వందార్థాల డైలాగ్ లు ఎక్కువగా వినిపిస్తాయని అన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఈవివి సత్యనారాయణ తీసిన హాస్య సినిమాలలో కూడ బూతు డైలాగులు ఎక్కువగా వినిపించేవి. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ లోకి ‘ఎఫ్ 3’ మూవీని అనీల్ రావిపూడి నడిపించాడ అన్న సందేహాలు ఇండస్ట్రీలోని కొందరికి వస్తున్నాయి. మరొక వైపు ఈ మూవీకి చేస్తున్న ప్రమోషన్ తో టివి ఛానల్స్ పత్రికలు హోరెత్తిపోతున్నాయి.


ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ బుక్ మై షోలో ఓపెన్ అయింది. అయితే ఈ మూవీ మొదటిరోజు మొదటి షోకు సంబంధించిన టిక్కెట్ల హడావిడి ఇంకా పెద్దగా ప్రారంభం అయినట్లు కనిపించడం లేదు. ‘కేజీ ఎఫ్ 2’ విడుదల ముందు ఇంకా వారం రోజులు ఉండగానే ఆమూవీ టిక్కెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడు పోయాయి. అయితే అలాంటి స్పీడ్ ‘ఎఫ్ 3’ విషయంలో కనిపించడం లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: