విజయ్ దేవరకొండ హీరోగా పరిచయమైన పెళ్లిచూపులు సినిమా కు అటు తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది ఈ సినిమా మరోసారి యూత్ బాగా ఆకట్టుకుంది. మంచి విజయాన్ని సాధించాడు. అంతేకాదండోయ్ పలు సినిమాల్లో నటుడిగా కూడా తనలో ఉన్న ప్రతిభను చాటుకున్నాడు. ఇంకోవైపు కొన్ని కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా అవతారమెత్తి మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు తరుణ్ భాస్కర్. కానీ ఇప్పుడు మాత్రం అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్న తరుణ్ భాస్కర్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఖాన్ సినిమాలను రిజెక్ట్ చేశారట కదా అంటూ అడగగా.. అవును రిజెక్ట్ చేశాను అంటూ తెలిపాడు. సల్మాన్ ఖాన్ ఓ రోజు ఫోన్ చేసి నాతో సినిమా చేస్తావా అంటూ అడిగితే.. ఇక ఫోన్ లోనే రిజెక్ట్ చేయకుండా నేరుగా వెళ్లి సినిమా మీతో చేయలేను అని చెప్పాను అంటూ తరుణ్ భాస్కర్ అన్నాడు. రిజెక్ట్ చేయడానికి ముంబై వెళ్లాల్సిన పనేంటి అంటూ అని ప్రశ్నించగా.. ఏమో అలా అనిపించింది ముంబై కూడా చూడొచ్చు కదా అని వెళ్ళాను అంటూ ఆసక్తికర సమాధానం చెప్పాడు. సల్మాన్ ఖాన్ సినిమా రిజెక్ట్ చేసిన విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు..