ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెండు వారాల పాటు కళ్లు చెదిరే స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు రాగా ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టయట.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కలెక్షన్ల విషయంలో అయితే ఆర్ఆర్ఆర్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోందనే విషయం తెలిసిందే. ఓటీటీలో ఆర్ఆర్ఆర్ ను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారట..

ఆర్ఆర్ఆర్ ప్రేక్షకులను ఆకట్టుకుందని అయితే రాజమౌళి మరింత అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే ఇంకా బాగుండేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. చరణ్, తారక్ స్క్రీన్ స్పేస్ విషయంలో కొంతమంది జక్కన్నను ట్రోల్ చేస్తున్నారు.క్లైమాక్స్ లో ఎన్టీఆర్ కు కూడా కొంతమేర ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదని చాలామంది కూడా అభిప్రాయపడ్డారు. అయితే గత కొన్నిరోజులుగా అమెరికాలో ఆర్ఆర్ఆర్ అన్ కట్ ను ప్రదర్శిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తున్న విషయం తెలిసిందే.


ఆర్ఆర్ఆర్ అన్ కట్ అంటే ఈ సినిమాలో కొత్త సన్నివేశాలు ఉంటాయని చాలామంది కూడా భావిస్తున్నారు. మరి కొందరు ఆర్ఆర్ఆర్ సినిమా ఎడిటింగ్ చేయని వెర్షన్ ను అన్ కట్ వెర్షన్ అని అనుకుంటున్నారట.. అయితే థియేటర్లలో మనం చూసిన మూవీనే అన్ కట్ వెర్షన్ పేరుతో రీరిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది.. అన్ కట్ వెర్షన్ అంటే వేరే వెర్షన్ అని భావించే వాళ్లకు ఇది ఒకింత షాకేనని చెప్పవచ్చు.ఆర్ఆర్ఆర్ టీమ్ తెలివిగా ప్రచారం చేస్తూ దోచుకుంటుందని నెటిజన్లు భావిస్తున్నారట.

 

జూన్ 1వ తేదీన అమెరికాలో రీరిలీజ్ కానున్న అన్ కట్ వెర్షన్ ను చూడాలని టికెట్లు కూడా బుకింగ్ చేసుకుంటున్న ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనిస్తే మంచిది. ఓటీటీలో ఆర్ఆర్ఆర్ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: