ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ అయిన సినిమాల టైటిళ్లను ఇక ఇప్పుడు యువ హీరోలు సినిమాలకు పెట్టుకుంటూ ప్రేక్షకుల అటెన్షన్ మొత్తం గ్రాబ్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఇలా మెగాస్టార్ సినిమాల టైటిల్ తో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు మరో సినిమా కూడా రాబోతుంది అని తెలుస్తుంది. బాలచందర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రుద్రవీణ. అప్పట్లో ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఇక ఈ టైటిల్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా రాలేదు అని చెప్పాలి. అయితే ఇప్పుడు అదే టైటిల్ తో ఇప్పటి తరానికి అనుగుణంగా కొత్త రకమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారూ. దర్శకుడు మధుసూదన్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది అనేది తెలుస్తుంది.  రివేంజ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందట. రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల్లా సినిమాస్ పతాకంపై సినిమాను నిర్మించబోతున్నారు. ఇక చిరంజీవి సినిమాకు, టైటిల్ కు ఎలాంటి మచ్చ రానీయకుండా ఇక దానికి తగ్గట్లుగానే ఈ తరానికి అనుగుణంగా తమ సినిమాను  డిజైన్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.


 ఈ క్రమంలోనే ఈ సినిమా కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ఒక రివెంజ్ స్టోరీ నీ తెరకెక్కిస్తున్నామని అంటూ దర్శకుడు మధుసూదన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఇక చిరంజీవి సినిమా రుద్రవీణ అనే టైటిల్తో వస్తుండడంతో ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత అటు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ పొందబోతోంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: