F-2 సినిమా సక్సెస్ కావడంతో అదే తరహాలో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా డైరెక్టర్ అనిల్ రావిపూడి f-3 సినిమాని తెరకెక్కించారు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అయితే చిత్ర బృందం లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ ప్రమోషన్ పనులో చాలా బిజీగా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన విషయాలే పలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.


డైరెక్టర్ అనిల్ రావిపూడి కేవలం సినిమాని తెరకెక్కించడమే కాకుండా సినిమాను జనాల్లోకి బాగా ఎక్కించేలా కనిపిస్తున్నారు. ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో ఈ సినిమా అయితే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా క్రియేట్ చేశాయి. సినిమాకు సంబంధించిన సాంగ్స్ అలాగే మేకింగ్ వీడియో లు కూడా మంచి హైప్ ను క్రియేట్ చేశారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొద్దిసేపటి క్రితం ఈ సినిమా నుంచి విడుదల చేసిన మేకింగ్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తేజ్, ఆలీ సునీల్ ఇలా మరి కొంతమంది స్టార్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు.


ప్రస్తుతం విడుదలైన ఈ వీడియోలో డైరెక్టర్ అనిల్ రావిపూడి హైలెట్గా మారారు. సాధారణంగా అనిల్ రావిపూడి తన ప్రతి సినిమాలో కూడా సన్నివేశాల్లో యాక్ట్ చేసి మరి చూపిస్తూ ఉంటారు అని అందరూ అంటుంటారు. అయితే ఈ వీడియో చూస్తే అది నిజమే అనిపిస్తోంది. ఎవరు ఎంత టైమింగ్ లో చేయాలి ఎంత బాగా చేయాలి అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది కనుక అప్పుడే సినిమా అనుకున్నట్లుగా వస్తుంది ఈ విషయం డైరెక్టర్ అనిల్ రావిపూడి 100% కరెక్ట్ అని నిరూపించుకున్నారు. ఇక మేకింగ్ వీడియోలో కూడా హడావిడి చూస్తుంటే ఈ సినిమా కామెడీ ఊహించిన కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: