విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎఫ్3.ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ఈనెల 27వ తేదీన విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.


ఇక విడుదల తేదీకి ఒకరోజు మాత్రమే ఉండడంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వెంకటేష్ మీడియా సమావేశంలో మాట్లాడారట..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రస్తావించారట..


ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ తాను ఒక సినిమా షూటింగ్ కోసం సెట్ లోకి వెళ్ళినప్పుడు నిర్మాత పక్షాన ఆలోచిస్తానని ఆయన వెల్లడించారు. సెట్ లో ఏది వృధా అవుతున్న తాను ఏమాత్రం ఒప్పుకోనని తెలిపారట.ఇక ఫిలిం మేకింగ్ కి ఒక ఫార్ములా అంటూ ఉండదని, చివరికి రిజల్ట్ బాగుంటేనే అప్పటి వరకు మనం పడిన కష్టం కూడా మర్చిపోతామని వెంకటేష్ వెల్లడించారట.. అదే విధంగా మీడియా సమావేశంలో పాన్ ఇండియా సినిమాల గురించి కూడా ఆయన మాట్లాడారు.


ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది స్టార్స్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.ఈ క్రమంలోనే వెంకటేష్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తనకు అలాంటి ఆలోచనలు అయితే లేవని తెలిపారు. సరైన టీం కుదిరితే తప్పకుండా తాను కూడా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తానని వెంకటేష్ ఈ సందర్భంగా పాన్ ఇండియా సినిమాల గురించి తెలియజేశారట. ఇకపోతే ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారికంటూ ఎంతో మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే వెంకటేష్ వారసుడిగా తన కొడుకు సినీ ఎంట్రీ గురించి ప్రశ్నించగా ప్రస్తుతం తన దృష్టి మొత్తం చదువు పైనే ఉందని, ఇప్పటికైతే ఎలాంటి ఆలోచనలు లేవని వెంకటేష్ తెలియజేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: