టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నవమన్మధుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన లవ్ , రొమాంటిక్, యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు.


అయితే ఇలాంటి సినిమాలతో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న నాగార్జున ను ఉన్నట్టుండి భక్తిరస కావ్యంలో చూపించబోతున్నాము అని దర్శకుడు రాఘవేంద్రరావు ప్రకటించడంతో ప్రతి ఒక్కరి లో సందేహం మొదలైందట.. అంతేకాదు ఇప్పటి వరకు లవ్ , యాక్షన్ సినిమాలు మాత్రమే చేసిన నాగార్జున ఒక్కసారిగా భక్తిరస కావ్యంలో నటించి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడు..? అంటూ ఒక్కొక్కరూ ఒక్కో రకంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారట.


ఇక ప్రకటించిన మొదటి రోజే ఎన్నో విమర్శల పాలయ్యారట నాగార్జున. కానీ అవన్నీ పట్టించుకోకుండా అన్నమయ్య పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయారు అని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమా విడుదలైన తర్వాత నాగార్జునకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయట. అంతేకాదు సిల్వర్ జూబ్లీ చేసుకొని రికార్డు కూడా సృష్టించింది. ఇకపోతే అన్నమయ్య పాత్రలో నాగార్జున లీనమైపోయి నటించాడు మరి వెంకటేశ్వర స్వామి పాత్ర కు ఎవరైతే బాగుంటుంది అని దర్శకుడు ఎంతోమందిని కూడా సంప్రదించడం జరిగింది.


అందులో భాగంగానే శోభన్ బాబును కూడా వెంకటేశ్వరస్వామి పాత్రకోసం సంప్రదించగా.. అప్పటికి సినిమాలకు రిటైర్మెంట్ తీసుకున్నారట శోభన్ బాబు.. ఇకపోతే అన్నమయ్య సినిమాలో కొన్ని సందర్భాలలో వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అన్నమయ్య తాకాల్సి ఉంటుందట. అందుకోసమే ఇలాంటి పాత్ర కోసం చాలా ప్రత్యేకమైన వ్యక్తులను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట దర్శకుడు.

ఇక ఈ క్రమంలోనే శోభన్ బాబుకు దర్శకుడు వెళ్లి కథ వినిపించగా.. శోభన్ బాబు.. అసలే నాగేశ్వర రావు కొడుకు పైగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆయనకు ఉంది.


ఒకవేళ సన్నివేశంలో అన్నమయ్య పాత్రధారి పాదాలు తాకితే అభిమానులు కూడా హర్ట్ అవుతారు. గొడవలు వస్తాయి అని ఆలోచించిన శోభన్ బాబు నేరుగా వద్దు అని చెప్పలేక 50 లక్షల రూపాయల పారితోషకం అడిగారని సమాచారం. ఇక అంత పారితోషకం అయితే ఇవ్వలేరు కాబట్టి నో చెప్పలేక శోభన్ బాబు అలా చెప్పారట. ఇక దర్శక నిర్మాతలు కూడా అంత పారితోషకం అడిగేసరికి శోభన్ బాబు ను తప్పించారు అని తెలుస్తుంది. ఇక ఆ తర్వాత బాలకృష్ణ ను అడగగా.. బాలకృష్ణ  అయిన కూడా అభిమానుల మధ్య బాగా గొడవలు తలెత్తుతాయి.


ఇక నాగార్జున తన పాదాలను ముట్టుకుంటే మరింత సమస్యలు వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది అని ఆలోచించి వెంటనే ఈ పాత్రకు ఆయన ఒప్పుకోలేదట. అలా వీరిద్దరూ కూడా అభిమానులకు భయపడి వెంకటేశ్వరస్వామి పాత్ర చేయడానికి ఒప్పుకోలేదట. ఇక అప్పటికే మంచి ఫామ్లో ఉన్న సుమన్ ను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక అలా వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అయితే బాగా మెప్పించాయి. ఇక ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: