టాలెంటెడ్ డైరక్టర్ వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమా అంటే సుందరానికీ. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన నజ్రియా హీరోయిన్ గా నటిస్తుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఒక క్రేజీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుంది. సినిమా నుండి వచ్చిన టీజర్ ఇప్పటికే మూవీపై ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది. నాని, నజ్రియాల మధ్య లవ్ స్టోరీ ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా నుండి వస్తున్న సాంగ్స్ ఇప్పటికే క్రేజ్ తెచ్చుకోగా లేటెస్ట్ గా సినిమా నుండి బ్లూపర్స్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. షూటింగ్ టైం లో జరిగిన సరదా సంఘటనలను బ్లూపర్స్ వీడియోలో ఉంచారు. చూస్తుంటే సినిమా షూటింగ్ కూడా చాలా సరదాగా చేసినట్టు ఉన్నారు. శ్యామ్ సింగ రాయ్ తర్వాత నాని చేస్తున్న అంటే సుందరానికీ సినిమా కంప్లీట్ ఎంటర్టైనింగ్ సినిమాగా వస్తుంది. సినిమాలో సుందరం పాత్రలో నాని మరోసారి తన నాచురల్ నటనతో ఆకట్టుకోనున్నాడు.  

ఇక డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయకపోయినా సరే తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న నజ్రియా నాని అంటే సుందరానికీ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అవుతుంది. నాని, నజ్రియాల జోడీనే సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. శ్యామ్ సింగ రాయ్ హిట్ తర్వాత నాని చేస్తున్న ఈ సినిమా కూడా తన ఖాతాలో మరో హిట్ అందిస్తుందని నమ్మకంగా ఉన్నారు నాని. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో సక్సెస్ అందుకున్న డైరక్టర్ వివేక్ ఆత్రేయ ఖచ్చితంగా ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేలా ఉన్నాడని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత నాని దసరా సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: