ఎఫ్2 ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కామెడీ చిత్రంగా హిట్ టాక్ ను అందుకుంది. భార్యా బాధితుడు ఎలా చేస్తాడు..తన ఆవేశాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు అనే అంశం మీద సినిమా కథ ఉంటుంది.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా వచ్చింది. అదే ఎఫ్3.. ఆ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఆ సినిమా నుంచి బయటకు వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి..


లోకంలో పంచభూతాలతో పాటు మరో భూతం ఉంది.. అదే డబ్బు అనే కోణంలో ఈ కథ మొదలైంది. వెంకీ(వెంకటేష్), వరుణ్ (వరుణ్ తేజ్) .. డబ్బు, బంగారం అంటే ఆశ పడే భార్యలకు భర్తలుగా కనిపించారు. బాగా డబ్బు సంపాదించడానికి నానా పాట్లు పడే వీరికి, లోపాలు కూడా ఉంటాయి. వెంకీకి రేచీకటి ఉంటే, వరుణ్ కి నత్తి ఉంటుంది. మరి తమ లోపాలను కవర్ చేస్తూ.. డబ్బు సంపాదన కోసం వీళ్లు ఏమి చేశారు ? ఈ ప్రాసెస్ లో తమన్నా, మెహరీన్ వీరికి ఎలాంటి సమస్యలు సృష్టించారు ? ఈ మధ్యలో సునీల్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ పాత్రలు ఏమిటి ?

 

చివరికి ఈ సినిమాలో హీరోలు ఎం చేశారు అనేది సినిమా కథ.. వినోదం మోతాదు పెంచడానికే. అవును 'ఎఫ్‌3'కి వచ్చేసరికి అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మామూలు పాత్రకంటే ఇలాంటి పాత్రలతో ఎక్కువగా వినోదం సృష్టించే అవకాశం ఉంటుందని 'ఎఫ్‌ 3' టీమ్‌కి అనిపించిందట. దీంతో హీరో పాత్రల్ని అలా డిజైన్‌ చేశారట. రాత్రివేళల్లో వచ్చే సన్నివేశాల్లో వెంకటేష్‌ భలే వినోదం పండిస్తారు అని చెబుతున్నారు అనిల్‌...సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ పోటీ పడి నటించారు.. దాంతో సినిమా మంచి టాక్ ను అందుకుంది..మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో సాయంత్రం చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: