తెలుగు సినిమా పరిశ్రమలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నటులలో హీరో నాని కూడా ఒకరు.హీరో నాని హీరోయిన్ గా నజ్రియా ఫాహద్ నటిస్తున్న చిత్రం అంటే సుందరానికి.. ఈ సినిమాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది ఈ సినిమా జూన్ -10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం తెలియజేశారు. ఈ చిత్రం విడుదల సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లలో చాలా వేగంగా పాల్గొంటున్నారు. ఇందులోభాగంగానే ఇప్పటి వరకు నాని, నజ్రియా లు కలసి ఫన్నీ చిట్ చాటుకు సంబంధించి వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు మరొక ఆసక్తికరమైన వీడియోని విడుదల చేశారు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న కొన్ని సన్నివేశాలను వీడియో రూపంలో విడుదల చేశారు. ఈ వీడియో ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియో లో లో ప్రతి ఒక్కరు కూడా నవ్వులు పూజిస్తూ ఉన్నారు . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మాధ్యమిక లలో చాలా వైరల్ గా మారుతోంది.


షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ స్థాయిలో నవ్వులు పూయిస్తే ఇక థియేటర్లలో ఏవిధంగా నవ్వులు పూయిస్తుందో అని చెప్పకనే చెప్పవచ్చు.. పూర్తి స్థాయిలో ఈ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించడం జరుగుతోందట. ఈ సినిమా థియేటర్లో నవ్వుల తో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఏమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరి ఈ కామెడీ మేకింగ్ వీడియోను మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇక గతంలో కూడా నాని ఇలాంటి విభిన్నమైన పాత్రలోనే కనిపిస్తూ మంచి కామెడీతో ప్రేక్షకులను బాగా అలరిస్తు మంచి విజయాలను అందుకునేవారు. ఇప్పుడు ప్రస్తుతం అలాంటి వాటిని మళ్లీ ఫాలో అవుతూ విజయ బాటలో పడతాడు ఏమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: