యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుసగా బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా థ్యాంక్యూ చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు చిత్ర బృందం. అక్కినేని ఫ్యామిలీ తో కలిపి మనం సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నిర్మాతగా దిల్ రాజు ఉన్నారు. ఇక ఈ చిత్రం టీజర్ బుధవారం రోజున విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రంలో కూడా నాగచైతన్య మూడు డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

దీంతో ఈ సినిమా టీజర్ ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే లా కనిపిస్తుంది. ఈ టీజర్ 6 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్లో ట్రెండీగా మారుతోంది.. థాంక్యూ టీజర్లో రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక నాగచైతన్య జీవితంలో ఒక్కో దశలో ఒక్కో హీరోయిన్ ఉంటుందనే విషయాన్ని టీజర్లు చూపించడం జరుగుతోంది.. సంగీత దర్శకుడు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు మంచి ఫీల్ తీసుకువచ్చారు అని చెప్పవచ్చు. ఇక ఇందులో నాగచైతన్య చెప్పే ప్రతి లైలా కూడా బాగా ఆకట్టుకుంటోంది.


ముఖ్యంగా లైఫ్ లో ఇక కాంప్రమైజ్ అయ్యే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడికి వచ్చాను.. నన్ను నేను సరి చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది అంటూ చైతు చెప్తే డైలాగు  ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాడు. అయితే ఈ డైలాగ్ తన మాజీ భార్య సమంత ను ఉద్దేశించి మాట్లాడినట్టుగా నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏం మాయ చేశావే సినిమాతో సమంతతో నటించి ఆ తర్వాత ప్రేమించి వివాహం చేసుకున్నాడు నాగచైతన్య. ఇక వీరిద్దరూ విడాకులు ప్రకటన చేసినప్పటి నుంచి వీరి విషయంలో జరిగే ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తాజాగా థాంక్యూ చిత్రం లో వచ్చిన ఈ డైలాగ్ డైరెక్టుగా సమంతానే అన్నట్లుగా కొంతమంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: