టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన నాగ చైతన్య గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నాగ చైతన్య వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే నాగ చైతన్య లవ్ స్టోరీ , బంగార్రాజు సినిమా లతో వరుసగా రెండు విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.

ఇలా రెండు విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన అందాల ముద్దుగుమ్మ రాశి కన్నా కథానాయికగా నటించింది. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్న ఉండగా ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ,శిరీష్ నిర్మిస్తున్నారు. 8 జులై 2022 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో తాజాగా థాంక్యూ సినిమా టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ టీజర్ లో నాగ చైతన్య డిఫరెంట్ డిఫరెంట్ మేక్ ఓవర్ లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే ఈ టీజర్ ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. థాంక్యూ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అందులో భాగంగా ఈ మూవీ టీజర్ విడుదలైన 24 గంటల్లో 6.08 మిలియన్ వ్యూస్ ని,  210.6 కే లైక్ లను సాధించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు పి సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తూ ఉండగా,  ఈ మూవీ లో అవికా గౌర్ , మాళవికా నాయర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: