ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చుకుంది కన్నడ భామ కృతి శెట్టి. మొదటి సినిమానే సెన్సేషనల్ హిట్ అవడంతో తెలుగులో అమ్మడికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఉప్పెన సూపర్ హిట్ అవడంతో వరుస సినిమా ఛాన్సులు అందుకుంది. అదే ఊపులో శ్యాం సింగ రాయ్, బంగార్రాజు సినిమాలు కూడా హిట్ అందుకుంది కృతి శెట్టి. హ్యాట్రిక్ హిట్ లతో దూసుకెళ్తున్న కృతి శెట్టి వచ్చిన ఛాన్సులన్నిటిని వాడుకుంటుంది. ప్రస్తుతం రాం తో ది వారియర్, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాలు దాదాపు మేల్ డామినేషన్ కథలుగానే కనిపిస్తున్నాయి.

ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ కు పెద్దగా స్కోప్ ఉండే అవకాశం కనిపించట్లేదు. ఇక మరోపక్క సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేస్తుంది కృతి శెట్టి. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద కృతి శెట్టి చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమా మళ్లీ తనకు మరో ఉప్పెన అవ్వాలని కోరుకుంటుంది ఈ అమ్మడు. అయితే ఫాం లో ఉన్నా కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కృతి శెట్టి కొద్దిగా ఆలోచించి సినిమాలు చేస్తే బెటర్ అంటున్నారు సినీ విశ్లేషకులు.

లేదంటే అమ్మడు ఇలానే అందరు హీరోయిన్స్ లానే కేవలం సాంగ్స్ కోసమే అన్నట్టు పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ఉప్పెనలో ఆమె పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. అలానే తన దగ్గరకు వచ్చే కథల్లో యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమాలనే చేస్తే బెటర్ అని అంటున్నారు. లేకపోతే అమ్మడు కొద్దిరోజుల్లోనే ఫేడవుట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న 3 సినిమాల్లో ఏ ఒక్కటి సూపర్ హిట్ అయినా కృతి శెట్టికి మరో ఐదేళ్ల దాకా తిరిగు ఉండదని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: