అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన చిత్రం f-3. ఇ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం తెరకెక్కించడం జరిగింది. కరోనా కారణంగా పలు సార్లు ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది.f-2 చిత్రానికి ఎంతటి ఘన విజయం అందుకొంది.. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ అంచనాలను అందుకుంటోంది. ఇక తమన్నా ,మెహరీన్ , సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇందులో స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించింది. ఇమే ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో ప్రేక్షకులు తమ స్పందన తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. F-3 సినిమాలో కూడా నవ్వులు పడ్డాయా లేదా ఏకంగా f-2 సినిమా ని మించిపోయేలా ఉందా అనే విధంగా ప్రేక్షకులు తెలియజేశారు వాటి గురించి చూద్దాం.


F-3 సినిమా ప్రారంభంలో వెంట వెంటనే క్యారెక్టర్లను చేయడం జరిగిపోతుందని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ రేచీకటి ఉన్న వ్యక్తిగా వరుణ్ తేజ్ నత్తి ఉన్న పాత్రలో కనిపించారు. ఎప్పటిలాగే వెంకీ కామెడీ టైంకి అదరగొట్టేశాడనే టాక్ వినిపిస్తోంది. వరుణ్ తేజ్ కూడ కామెడీ టైమింగ్తో కడుపుబ్బ నవ్విస్తాడని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ఇక సునీల్ కూడా ఎంతో కాలం తర్వాత కంప్లీట్ కామెడీ రోడ్ లో చూడడం చాలా సంతోషంగా ఉందని అభిమానులు అంటున్నారు.


ఫస్ట్ హాఫ్ లో ఫన్నీ సీన్స్ పండినప్పటికీ స్టోరీ పరంగా చూస్తే అంతగా ఆసక్తికరంగా ఉన్నట్లు కనిపించలేదట. వరుస ఫన్నీ సీన్స్ నవ్విస్తూ ఉండడం మూలంగా స్టోరీని పక్కనపెట్టి కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తున్నారు సినీ ప్రేక్షకులు. మరికొందరు మాత్రం ఈ సినిమా యావరేజ్ గా ఉందని పోస్టులు పెడుతున్నారు. ఇందులో రాజేంద్రప్రసాద్ ,సునీల్, ఆది వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: