సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా థియేట్రికల్ రన్ సోసోగా నడుస్తుంది. సినిమా మూడవ వారం లోకి అడుగు పెట్టగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండగా చిన్నగా ఈ సినిమాకు కలక్షన్స్ తగ్గుతున్నాయి. ఈ క్రమంలో సర్కారువ్ ఆరి పాట సినిమాను డిజిటల్ రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. అమేజాన్ ప్రైం సర్కారు వారి పాట సినిమా ఓటీటీ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. జూన్ 10 లేదా 24 తేదీల్లో సర్కారు వారి పాట ఓటీటీ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా కోసం థమన్ మ్యూజిక్ అందించగా సినిమాలో ఒక సాంగ్ ని ఆపేశారు. సర్కారు వారి పాట సినిమాలో కేవలం 3 సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. అయితే థమన్ కంపోజ్ చేసిన మురారి బావ సాంగ్ ని సినిమాలో ఉంచలేదు. ఆ సాంగ్ బదులుగా మ మ మహేష్ సాంగ్ ఉంచారు. ఈ క్రమంలో మురారి బావ సాంగ్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. మురారి బావ సాంగ్ ని చిత్రయూనిట్ ఎడిటింగ్ చేస్తుందని రెండో వారంలో థియేటర్ లో ఆ సాంగ్ యాడ్ చేస్తారని చెప్పారు. కానీ మురారి బావ సాంగ్ సినిమాలో యాడ్ చేయలేదు.

ఇక ఇదిలాఉంటే సర్కారు వారి పాట ఓటీటీ ఆడియెన్స్ కోసం మురారి బావ సినిమా యాడ్ చేస్తారని అంటున్నారు. మురారి బావ సాంగ్ ని ఫైనల్ ఎడిట్ చేసి సినిమా డిజిటల్ రిలీజ్ లో ఆ సాంగ్ ని యాడ్ చేస్తారని తెలుస్తుంది. ఓ విధంగా ఇది డిజిటల్ రన్ కు బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించింది. సినిమా 200 కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. మహేష్ వరుస సినిమాల సక్సెస్ మేనియాలో సర్కారు వారి పాట కూడా ఒకటిగా లిస్ట్ లో చేరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: