ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ మెరుపు మెరిసిన హీరోలలో ఒకరు భానుచందర్..తెలుగులో మాత్రమే కాదు కన్నడ తమిళ భాషల్లో కూడా చాలా సినిమాల్లో నటించారు ఆయన.తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించారు ఇక ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తన పాటలతో ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు మాస్టర్ వేణు తనయుడే ఈ భానుచందర్ అన్న విషయం తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ లో ఆయనకు మంచి పట్టు ఉండడంతో ఇక కెరీర్ ఆరంభంలోనే యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొని వచ్చాడు.


ఈయన స్క్రీన్ మీద కనిపించి చాలా కాలం అయ్యింది..కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కనిపించాడు.ఆ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.నాన్నకు రావాల్సిన గుర్తింపు రాలేదు. తెర వెనకే ఉండిపోయారు. అందుకే నేను తెరమీద హీరోగా కనిపించాలీ అని అనుకున్నాను. ఫ్రెండ్స్ మాత్రం నువ్వు హీరో ఏంట్రా అని ఎగతాళి చేసేవారు. నాన్నల సంగీతం నేర్చుకో ఉచిత సలహాలు ఇచ్చేవారు. కానీ నేనుహీరో అయ్యి చూపిస్తాను అంటూ వారితో ఛాలెంజ్ చేశాను..



తరంగిణి సినిమా తర్వాత నా ఫ్రెండ్ ను ఆ సినిమాకు తీసుకోని వెళ్ళాను..అప్పుడు నన్ను స్క్రీన్ మీద చూసి చాలా బాగా నటించావు.హీరోగా మంచి ఫ్యుచర్ ఉంది అని అన్నారు.ఆ సంతోషాన్ని నేను మర్చిపోలేను. సినిమాలు చేస్తున్న సమయంలో నేను మెగాస్టార్ చిరంజీవి రూమ్ మేట్స్ గా ఉండేవాళ్ళము.నేను బైక్ నేర్చుకోవాలని అనుకున్నపుడు నాకు రాయల్ ఎన్ఫీల్డ్ నడపడం నేర్పించింది మెగాస్టార్ చిరంజీవినె అంటు గుర్తుచేసుకున్నారు. ఇక చిరంజీవి నాకు మధ్య ఇప్పటికి కూడా అదే ఫ్రెండ్షిప్ ఉంది. ఏరా ఏరా అనుకుంటూ ఉంటాం. ఎక్కడ కలిసిన ఆప్యాయంగా పలకరించుకుంటాం.అందరికీ అతను మెగాస్టార్ అయితే నాకు మాత్రం మంచి స్నేహితుడు అంటూ ఆయన చెప్పుకోవచ్చారు..ఫ్యుచర్ లో మంచి ప్రాజెక్టు లు వస్తే మళ్ళీ సినిమాలు చేస్తానని చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: