బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సౌత్ నుంచి సినిమాల్నే కాదు ఇంకా మన స్టార్ హీరోలకున్న సక్సెస్ ఫార్ములాల్ని కూడా కాపీ కొడుతున్నారు. ఇక అక్షరాలా వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే అక్షయ్ కుమార్ మన స్టార్ హీరోల్ని చూసి రెమ్యూనరేషన్ సగానికి సగం తగ్గించేసుకుంటున్నారు.100కోట్లు.. అక్షయ్ కుమార్ అక్షరాలా ఒక్క సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్. సినిమా కనుక హిట్ అయితే 100 కాదు అంతకుమించి ఇవ్వడానికైనా ఓకే అంటారు ప్రొడ్యూసర్లు. కానీ కాస్త అటూ ఇటు కనుక అయితే అమ్మో అంతా అనుకుంటారు. ఈమధ్య వరసగా ఫ్లాపులు ఫేస్ చెయ్యడం వల్లనో ఏమో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన రెమ్యూనరేషన్ ని 100 కోట్ల నుంచి దాదాపు సగానికి తగ్గించేసుకున్నారు. ఇక ఈమధ్య సౌత్ నుంచి సినిమాల్నే కాదు ఇలాంటి సరికొత్త సక్సెస్ ఫార్ములాల్ని కూడా వంటపట్టించుకుంటున్నారు అక్షయ్ కుమార్.బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులొచ్చినా అక్షయ్ కుమార్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఏమాత్రం తేడా రాదు. అలాంటిది రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం అసలు ఏంటని తెగ ఆలోచిస్తున్నారు ఫాన్స్.



ఇటీవల మన తెలుగు హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకొని సినిమా హిట్ అయితే లాభాల్లో వాటాలను తీసుకుంటున్నారు. చిరంజీవి ఇంకా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా ఈ ఫార్ములాని ఫాలో అవుతున్నారు.ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా 100 కోట్లని 60 కోట్లకు తగ్గించేసుకుని లాభాల్లో వాటా తీసుకుందామని డిసైడ్ అయ్యాడు. ఈమధ్య అక్షయ్ కుమార్ చేసిన బచ్చన్ పాండే ఇంకా అలాగే పృధ్విరాజ్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కాయి. పృధ్విరాజ్ రిలీజ్ కాలేదు.బచ్చన్ లాండే సినిమా మాత్రం అనుకున్నంత హిట్ కాలేదు. అందులోనూ కమర్షియల్ గా కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది. దాంతో అక్షయ్ కుమార్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకుని ప్రాఫిట్ షేర్ తీసుకుంటున్నారంటోంది బాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: