సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ వచ్చినా అది నాలుగైదు విజయాలకు సమానం చెప్పాలి. సక్సెస్ ఉంటేనే అందరూ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి సినిమా పరిశ్రమలో వారసుల హీరోగా సైతం ఫ్లాప్ ఎదురైతే ఇలాంటి కష్టాలు ఎదురవుతాయి. నాలుగైదు హిట్స్ వచ్చి ఒక్క ఫ్లాప్ వచ్చినా కూడా ఎంతో పని అయిపోయినట్లుగా అనిపిస్తుంది. అందరికీ ఈ విధమైన తిప్పలు తప్పవు. అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. 

కోట్లాది కలెక్షన్లతో ఈ సినిమా సంచలనాత్మక రికార్డులను నమోదు చేయగా ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ చేసిన చిత్రం దారుణమైన పరాజయం కావడంతో అది ఒక్కసారిగా అందరినీ ఎంతగానో కలవరపెట్టింది. తండ్రి చిరంజీవితో కలిసి రామ్ చరణ్ చేసిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మిగిల్చింది. అంతేకాదు కోట్ల నష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఇటీవల కాలంలో ఈ తరహా లో ఫ్లాప్ ఆయన టాలీవుడ్ సినిమా ఏది లేదంటే నమ్మాలి. 

అందుకే ఇకపై చేయబోయే సినిమాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలని మెగా అభిమానులు కోరుతున్నారు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పైన ఇప్పుడు అందులో ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ చిత్రం తప్పకుండా చరణ్ స్టామినాను దేశానికి చాటి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఒక ఫ్లాప్ ఒక విజయంతో ఈ సంవత్సరం పూర్తి చేసుకున్న రామ్ చరణ్ వచ్చే ఏడాది ని ఏవిధంగా తమకు అనుకూలంగా మార్చుకుంటాడో చూడాలి. ఆ సినిమా తర్వాత నేషనల్ అవార్డు విన్నర్ అయిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ విధంగా ఈ రెండు చిత్రాలు ఆయనకు ఏ స్థాయిలో విజయాన్ని తెచ్చి పెట్టి రామ్ రణ్ ఇమేజ్ ను పెంచుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: