టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి టాలీవుడ్ టాలెంట్ దర్శకులలో ఒకరైన సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

 సైరా నరసింహా రెడ్డి లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏజెంట్ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అవుతున్నా, అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ డేలె అవుతూ వచ్చింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికీ ఈ సినిమా చిత్రీకరణ దశ లోనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఏజెంట్ సినిమా చిత్రీకరణలో భాగంగా ప్రస్తుతం అఖిల్ పై చిత్ర బృందం అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ యాక్షన్ సన్ని వేశాల కోసం అఖిల్ తీవ్రంగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం తెరకెక్కిస్తున్న యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్ గా నిలవనున్నట్లు సమాచారం.  ఇప్పటికే ఈ మూవీ కోసం కోసం అక్కినేని అఖిల్ అదిరిపోయే రేంజ్ లో బాడీ ని బిల్డ్ చేసుకొని,  అదిరిపోయే గెటప్ లో కనిపిస్తాడు. ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ తో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలననే కసితో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: