ఎట్టకేలకు నిరీక్షణ ఫలితం ఫలించింది అని చెప్పవచ్చు. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న మోస్ట్ అ వైటెడ్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదే అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య కలిసి నటించిన సినిమా "లాల్ సింగ్ చద్దా"ఈ సంవత్సరంలో అతి పెద్ద విడుదల కాబోతున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఐపీఎల్ ముగిసిన వెంటనే అభిమానుల సమక్షంలో టీవీలలో వీక్షిస్తూ ఉండగా ఈ ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.

ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల లో ఉత్కంఠను కలిగించింది. ప్రపంచ టెలివిజన్ ప్లాట్ఫామ్లు క్రీడా ప్రపంచం సాక్షిగా ఈ మూవీ ట్రైలర్ ని ఎంతో గ్రాండ్గా విడుదల చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రతి ఒక్క అభిమానులను కూడా ఏ మాత్రం నిరాశ పరచలేదు. సినిమాపై ఉత్కంఠ పెంచే ఎన్నో అంశాలు మెలకువలతో మంచి ట్రైలర్ ను విడుదల చేశారని చెప్పవచ్చు. ఈ సినిమా ట్రైలర్ ప్రతి ఒక్క ప్రేక్షకులని గుండెల ను టచ్ చేసే ఎలివేషన్స్ తో తీర్చిదిద్దినట్లు గా కనిపిస్తోంది. ఒక అమాయకుడిని ప్రపంచంలోకి వదిలితే..ప్రేక్షకులు ఒదిగిపోయే అంత బాగా నటించాడు అమీర్ ఖాన్.

ముఖ్యంగా అమీర్ ఖాన్ అభిమానులు భావోద్వేగానికి గురి చేసే అంత కంటెంట్ తో ఈ సినిమా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో పసిపిల్లల హృదయాలను కూడా గెలిచే విధంగా ఉన్నట్టుగా ట్రైలర్ లో చూపించడం జరిగింది. ఒక పిల్లాడిలా ఆశావాదం ఈ సినిమాకి ప్రధాన బలం అని చెప్పవచ్చు. ఇక ఇందులో కరీనా కపూర్, అమీర్ ఖాన్ మధ్య సన్నీవేషాలు బాగా చూపించడం జరిగింది. ఇక నాగచైతన్య , అమీర్ ఖాన్ కూడా ఇందులో మంచి స్నేహితులుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో మోనా సింగ్ అమీర్ ఖాన్ తల్లి పాత్రలో నటించారు. ఈ సినిమాతో నాగచైతన్య బాలీవుడ్లోకి సక్సెస్ అవుతాడని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: