కొన్ని కొన్ని సందర్భాలలో ఒకే రోజు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులే జూన్ 3 వ తేదీన కూడా కనిపించబోతున్నాయి. జూన్ 3 వ తేదీన తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వున్న మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. ఆ సినిమాల గురించి తెలుసుకుందాం .

మేజర్ : అడవి శేషు హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన మేజర్ సినిమా జూన్  3 వ తేదీన తెలుగు , మలయాళం , హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ , శోభితా ధూళిపాళ ముఖ్య పాత్రల్లో నటించారు.


విక్రమ్ : కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వం లో తెరకెక్కిన విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదీన తమిళ , తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది.  ఈ సినిమా లో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి , ఫాహాద్ ఫాజిల్ ,  సూర్య కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.  ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చాడు.


సామ్రాట్ పృథ్వీరాజ్ : అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూన్ మూడవ తేదీన హిందీ , తెలుగు , తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ , సోనూసూద్ , మనుషి  చ్చిల్లార్ ముఖ్య పాత్రల్లో నటించారు.


ఈ మూడు సినిమా లపై కూడా తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్  దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: