ఇక ఈ 2022 వ సంవత్సరంలో ఇంతవరకు వచ్చిన తెలుగు చిత్రాల్లో అతి పెద్ద హిట్ ఏది అనగానే క్షణం కూడా ఆలోచించకుండా అందరూ టక్కున చెప్పే సమాధానం ఏంటంటే 'ఆర్‌ఆర్‌ఆర్' అని. అలాగే తెలుగేతర సౌత్ సినిమాల్లో అయితే 'కేజీయఫ్ 2' పేరు చెబుతారు. కానీ ట్రేడ్ అనలిస్టుల మాట అయితే వేరే ఉంది. వాళ్లు బిగ్గెస్ట్ హిట్‌ అనే క్రెడిట్‌ను 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాకి ఇంకా 'కేజీయఫ్ 2'కి ఇవ్వడం లేదు.చిన్న సినిమా 'డీజే టిల్లు'కి ఇస్తున్నారు. అవును. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా రేంజ్‌ అలాంటిది. పైగా రాజమౌళి దర్శకుడు. ఎన్టీఆర్ ఇంకా రామ్‌చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు కూడా తమ నటనతో అద్భుతాన్ని సృష్టించారు. ఇక వీరితో పాటు ఆలియా భట్ ఇంకా అజయ్ దేవగన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో చేయడం మరో ప్లస్సయింది. ఒలీవియా మోరిస్, అలీసన్ డూడీ ఇంకా అలాగే రే స్టీవెన్సన్‌ లాంటి ఇంటర్నేషనల్ ఆర్టిస్టులూ ఈ సినిమాలో భాగమయ్యారు. అన్నిటికంటే ముఖ్యంగా దాదాపు 1150 కోట్లు కలెక్ట్ చేసిందీ మూవీ.ఇక అలాంటప్పుడు దాన్ని కాకుండా ఓ చిన్న సినిమాని పెద్ద హిట్ అని ఎలా అంటారు?ఇక ఈ ప్రశ్నకి జవాబుగా అనలిస్టులు మరో ప్రశ్నను సంధిస్తున్నారు. 350 కోట్లకు పైనే ఖర్చుపెట్టి తీసిన సినిమాకి 600 కోట్ల షేర్ రావడం గొప్పా? లేక 8 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి తీసిన సినిమాకి 17 కోట్ల షేర్ రావడం గొప్పా? ఇక దీనికి కనుక జవాబు చెప్పగలిగితే ఏది పెద్ద హిట్ అనే లెక్క ఇట్టే తేలిపోతుంది అంటున్నారు వాళ్లు.



ఇక ప్రెస్టీజియస్ సినిమాల కలెక్షన్ల విషయంలో గ్రాస్ కాకుండా కేవలం షేర్‌ను మాత్రమే తీసుకుంటే కాస్త అటూ ఇటూగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా రూ.610 కోట్లు, 'కేజీయఫ్2' 502 కోట్లు, 'భీమ్లానాయక్' రూ.80 కోట్లు ఇంకా 'రాధేశ్యామ్' రూ.83 కోట్లు అలాగే 'ఆచార్య' రూ.28 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలకు పెట్టిన బడ్జెట్ కూడా చాలా ఎక్కువ. అయితే చిన్న సినిమా డీజే టిల్లు సినిమాని 8 కోట్లు మాత్రమే పెట్టి తీస్తే.. ఇది 30 కోట్ల గ్రాస్‌ను, 17 కోట్ల షేర్‌ను రాబట్టి సెన్సేషనల్ హిట్ అయ్యింది. అందుకే ఈ సినిమాయే  ఈ ఏడాదికి పెద్ద హిట్, టిల్లు సినిమానే గ్రేట్ అంటున్నారు సినీ పండితులు. అలాగే "సర్కారు వారి పాట", "ఎఫ్‌ 3" సినిమాల వసూళ్ల లెక్క కూడా అతి త్వరలోనే తేలుతుంది. అయినా కూడా ఈ సినిమాలకి కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది, అప్పుడు కూడా డీజే టిల్లు సినిమానే టాప్‌లో నిలబడుతుందని అంటున్నారు.ఎందుకంటే బడ్జెట్ తక్కువ ప్లస్ అంతకంటే మంచి లాభాలను తెచ్చిపెట్టింది కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: